Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ భూమి వేలానికి రెడీ? హెచ్ఎండీఏ సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ :హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీ (MLA Colony)లో, ఏసీబీ కార్యాలయం సరిగ్గా ముందర ఉన్న 8.24 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA Land Auction) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ల్యాండ్ పార్శిల్ మార్కెట్ విలువ సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ వేలం ప్రక్రియకు సంబంధించి జూన్ 12న ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించి, జూన్ 19న తుది వేలంపాటను చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ అధికారికంగా బోర్డును కూడా ఏర్పాటు చేసింది.

అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంపై స్థానికులు, పర్యావరణ ప్రేమికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ స్థలంలో ఉన్న భారీ వృక్షాలు, సహజసిద్ధమైన కొండలను కాపాడుతూ ఒక అందమైన థీమ్ పార్కును ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా, గత ఏడాది మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సైతం ఈ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగిస్తామని స్థానికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టి, భూమిని ప్రైవేటు శక్తులకు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో స్థానిక ప్రజలు మరోమారు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

ఈ స్థలానికి వివాదాస్పద నేపథ్యం కూడా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందు ఈ స్థలంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు తొలగించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కానీ, ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఆయా వర్గాలు మౌనం వహించగా, ఇప్పుడు ఏకంగా భూమినే అమ్మకానికి (HMDA Land Auction) పెట్టడం గమనార్హం. పర్యావరణాన్ని కాపాడాలని, ఈ భూ పందేరాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు తమ నిరసనను ఉధృతం చేసే యోచనలో ఉన్నారు.

Read Also: మందమర్రిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>