కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి స్వామివారి స్వయంభూ మూలవిరాట్టును దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవాని శంకర్ కేంద్ర మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు.
Read Also: ఆ భూమి వేలానికి రెడీ? హెచ్ఎండీఏ సంచలన నిర్ణయం!
Follow Us On : WhatsApp

