గురుకులంలో ఖాళీలు.. 26 వరకు దరఖాస్తులకు అవకాశం

కలం, నిర్మల్​ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ జనరల్ బాలికల గురుకుల పాఠశాలలో (Nirmal Gurukulam) వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డేనియల్ తెలిపారు. ఆరవ తరగతిలో నాలుగు, ఏడవ తరగతిలో రెండు, ఎనిమిదో తరగతిలో ఒక సీటు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అర్హులైన విద్యార్థులు బోనాఫైడ్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఈ నెల 26వ తేదీలోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>