జనగామలో ఆర్టీసీ డ్రైవర్ మానవత్వం

కలం, జనగామ: ఆర్టీసీ బస్సే అంబులెన్స్‌గా మారిన ఘటన జనగామ (Jangaon) జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో చోటుచేసుకుంది. డ్రైవర్ (RTC Driver) చొరవతో ఓ వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో ఆయనపై ప్రశంసల వెల్లువ కురిసింది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన పూలసుల ఉప్పలయ్య (66) వరంగల్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పాలకుర్తి నుంచి హన్మకొండకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని అండర్‌బ్రిడ్జ్ వద్ద అకస్మాత్తుగా ఆయనకు ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయారు.

దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ కిషన్ రావు వెంటనే స్పందించారు. ముందుగా 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా అది అందుబాటులోకి రాకపోవడంతో ఆయన ఆలస్యం చేయకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్సునే అంబులెన్స్‌గా మార్చి బాధితుడిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వేగంగా తరలించారు. అక్కడ వైద్యులు వెంటనే ప్రధమ చికిత్స అందించడంతో ఉప్పలయ్య ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. డ్రైవర్ కిషన్ రావు (RTC Driver Kishan Rao) చూపిన మానవత్వం, సమయస్ఫూర్తి అక్కడున్న వారిని కదిలించింది. ప్రయాణికులు, స్థానికులు ఆయనను ప్రశంసిస్తూ నిజమైన హీరో అని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సిబ్బంది స్పందన వల్లే ప్రజల్లో ఆర్టీసీపై విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

Read Also: జీవన్ రెడ్డి‌తో కేటీఆర్ భేటీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>