కలం, వలిగొండ: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌ది (RTC Driver Shankar Goud) ప్రభుత్వ హత్యేనని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి (Madhusudhana Chary) ఆరోపించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పబ్బం గడుపుతుందని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు.
రూ. కోటి పరిహారం అందించాలి
శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం అందించాలని మధుసూదనాచారి (Madhusudhana Chary) డిమాండ్ చేశారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ అభద్రత భావంతో పాలన కొనసాగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు తుమ్మల వెంకటరెడ్డి, జానీ అప్రోచ్, మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, కొమురెల్లి సంజీవరెడ్డి, పల్సం రమేశ్, పడమటి మమత, మద్దెల మంజుల, పల్సం రాజు, పబ్బు స్వామి, బల్గురి నరేష్ రెడ్డి, పోలేపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Also: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
Follow Us On: Instagram

