పెట్రోల్‌, డీజిల్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా (Petrol Diesel) నిరాటంకంగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చమురు సరఫరాలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. “వినియోగదారుల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతోంది. ఆయిల్ సంస్థలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. ఇక LPG సిలిండర్ల బుకింగ్స్ కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగాయి. డిమాండ్ కు తగ్గట్లుగానే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందిస్తున్నాం. వాణిజ్య అవసరాలకు సంబంధించి కొన్ని సమస్యలున్న మాట వాస్తవమే. అయితే, కేంద్రం ప్రత్యేక ప్రణాళికతో వాటిని అధిగమించి.. సిలిండర్ల సరఫరాను 70 శాతానికి పెంచింది. ప్రజల ఇబ్బందులను పూర్తిగా తగ్గించేందుకు సంబంధిత విభాగాలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి” అన్నారు.

ఎరువుల సరఫరా సాధారణ స్థాయికి..

ఎరువుల సరఫరాను తిరిగి 95 శాతం మేర సాధారణ స్థాయికి చేర్చినట్లు సుజాత శర్మ వివరించారు. సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి డిమాండ్, సరఫరా మధ్య సమతూకం దెబ్బతినకుండా తమ మంత్రిత్వ శాఖ ప్రణాళికతో వ్యవహరిస్తోందని తెలిపారు. దేశీయ రిఫైనరీ సంస్థల్లో LPG ఉత్పత్తిని మరింత పెంచడంతో పాటు ప్రజావసరాల నేపథ్యంలో క్రూడాయిల్, ఎల్పీజీ రవాణా పక్కదారి పట్టకుండా ప్రత్యేకంగా లెవీ కూడా విధిస్తున్నామని స్పష్టం చేశారు. ఫలితంగా దేశీయ మార్కెట్లలో వీటి కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు.

Read Also: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>