నెల్లూరు జిల్లాలో ప్రమాదం: బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు (Nellore) జిల్లా కోలగట్ల (Kolaghatla) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ప్రయాణికులందరూ ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను బస్సు నుండి బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>