Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు కర్ణాటకలో పర్యటించనున్న మంత్రి లోకేశ్‌

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరులో ఏపీ మంత్రి లోకేశ్ (Nara Lokesh)​ శనివారం పర్యటించనున్నారు. ఉదయం కర్ణాటకలోని సింధనూరుకు చేరుకుని ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం హోసల్లీ క్యాంప్ గంగావతి రోడ్డులోని కమ్మవారి కళ్యాణ మండపంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్​తో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.ఆ తరువాత హోసల్లీ క్యాంప్ లో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో లోకేశ్ పాల్గొననున్నారు. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని లోకేశ్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. లోకేష్ పర్యటన దృష్ట్యా అక్కడి పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>