epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైద‌రాబాద్‌లో ఆర్టీఏ స్పెష‌ల్ డ్రైవ్‌

క‌లం వెబ్ డెస్క్ : సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని దృష్టిలో పెట్టుకొని హైద‌రాబాద్‌(Hyderabad)లో ఆర్టీఏ(RTA) అధికారులు స్పెష‌ల్ డ్రైవ్(Special Drive) నిర్వ‌హించారు. గ‌త నాలుగు రోజుల నుంచి న‌గ‌రం నుంచి ఏపీకి భారీ ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్ ప్ర‌యాణిస్తున్నాయి. వీటిలో కేపీహెచ్‌బీ, ఎల్బీ న‌గ‌ర్‌, జేఎన్టీయూ, అమీర్‌పేట్‌, ఎస్ఆర్ న‌గ‌ర్‌ త‌దిత‌ర ప్రాంతాల నుంచి ఎక్కువ బ‌స్సులు న‌డుస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం తెల్ల‌వారుజాము నుంచి కేపీహెచ్‌బీ, జేఎన్టీయూలో ఆర్టీఏ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌కు డ‌బుల్ రేట్లు వ‌సూలు చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఏకంగా ఒక్కో ప్ర‌యాణికుడి నుంచి రూ.4,500 వ‌సూలు చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్న‌ 7 బ‌స్సుల‌పై కేసులు న‌మోదు చేశారు. ఒక బస్సును సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెట్స్ యాజ‌మాన్యాలు త‌ప్ప‌కుండా నిబంధ‌న‌లు పాటించాల‌ని, లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>