కలం, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అవకాశంగా బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఎక్స్ వేదికగా చేసిస పోస్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సబంధించి బాధిత కుటుంబసభ్యులతో తాను స్వయంగా మాట్లాడినట్లు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాలు అత్యంత దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, బాధితుల ఆవేదనను తాను త్వరలో వీడియో రూపంలో బయటపెడతానని ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. మైనర్ బాలికను వేధించిన నిందితుడి తండ్రిని మంత్రి వర్గంలో కొనసాగిస్తారా? లేదా? అనేది ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత సంచలనంగా మారిన ఈ అంశంపై ప్రధాని త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రవీణ్ కుమార్ తన పోస్టులో బేటీ బచావో బేటీ పడావో అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించారు. అలాగే తన పోస్టులో సైబరాబాద్ సీపీ, తెలంగాణ డీజీపీని, ప్రధాని మోడీని ట్యాగ్ చేశారు. ప్రవీణ్ కుమార్ పోస్టుతో ఆయన ఏ విషయాలు బయట పెడతారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

