Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీస్ స్టేషన్ పక్కనే ఆలయ చోరీ.. భద్రతా వ్యవస్థపై సవాల్!

కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని మేడిపల్లి (Medipally) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు శనివారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డారు. అనంతరం హుండీని పగలగొట్టి హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు.

అయితే పోలీస్ స్టేషన్‌ను ఆనుకుని ఉన్న ఆలయంలోనే ఈ చోరీ జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఫల్యంపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసుల పహారా ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. ఈ చోరీ ఘటన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>