రూ.లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ జేబులోకి పోతుంది: RSP

కలం, వెబ్ డెస్క్: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి కబ్జాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు చెందిన రూ.లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) జేబులోకి పోతుందని.. బడా బడా కంపెనీల జేబులోకి పోతుందని సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావుపై పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రక్షకుడే భక్షకుడిగా మారాడని.. తమ నేత హరీశ్ రావు గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), హరీశ్ రావులే పొంగులేటి లాంటి భక్షకుల నుండి తెలంగాణను కాపాడుతున్నారని చెప్పారు. మన గుట్టలు పిండి అవుతున్నాయని.. మన భూములు దోపిడీకి గురవుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.

పొంగులేటి సవాల్..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సవాల్ విసిరారు. బోర్డులు తిప్పేసి, బ్లూ షీట్స్ మాత్రమే చూపించడం కాదని.. వాటిపై ఎవరి పేరుంది? అనే విషయం పొంగులేటి చెప్పలేదన్నారు. దమ్ముంటే పొంగులేటి (Ponguleti) రికార్డులతో రా.. తాము ఆధారాలతో అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి లెక్కలు తెలుస్తామని సవాల్ విసిరారు. ‘పొంగులేటి గారూ.. మీలాగా మాకు గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష రాదు. రాఘవ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా తెలంగాణ ఆస్తులను తిమింగళం లాగా దోచుకుంటున్నారో అందరికీ తెలుసు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పొంగులేటి ఎందుకు సమాధానం చెప్పలేదు?

నాదర్‌గుల్ భూముల గురించి ఒళ్ళు గగ్గురపరిచే విషయాలు తమ నాయకుడు హరీశ్ రావు ప్రజలకు తెలియజేశారని ప్రవీణ్ కుమార్ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ తీసుకోవడమే తప్పు అని చెప్పారు. నాదర్‌గుల్ భూములను కాపాడిందే బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. నాదర్‌గుల్ భూములకు బ్లూ షీట్స్ వేస్తే, వెంటనే చర్యలను తీసుకోవాల్సిన మంత్రి పొంగులేటి, నాదర్‌గుల్ భూముల కాపాడకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. అందుకే దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాదర్‌గుల్ భూముల్లో రోజుకో బోర్డు మారుతుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పలేదు అని ప్రశ్నించారు.

Read Also: సిఎస్ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు పెట్టాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>