కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పటాన్ చెరువు (Patancheru) నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల నుండి వచ్చే సిఎస్ఆర్ నిధులను స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించకుండా, ఇతర ప్రాంతాలకు నిధుల తరలింపు జరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో.. స్థానిక నిధులు స్థానికంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ పరిశ్రమలు అందిస్తున్న సిఎస్ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు చేయకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
పరిశ్రమల నిర్వహణ వలన ప్రతి రోజు వాయు, జల కాలుష్యలతో జీవనం కొనసాగిస్తున్న పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు అందిస్తున్న సి ఎస్ ఆర్ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు నిర్వహించలన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా సిఎస్ఆర్ నిధులు లేకపోవడం మూలంగా అభివృద్ధి కుంటూ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పరిశ్రమల CSR నిధులు స్థానిక పటాన్ చెరువు నియోజకవర్గ అభివృద్ధి పనులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వినతి సమర్పించారు. నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమం చేస్తామని, ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి పటాన్ చెరువు నియోజకవర్గం నుండి చెల్లిస్తున్న సిఎస్ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు పెట్టాలని.. లేని పక్షంలో ప్రజల నిరసనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) హెచ్చరించారు.
Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం
Follow Us On : WhatsApp

