DC vs GT: టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ ‌‌‌‌- 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ (DC vs GT) మధ్య మ్యాచ్ షురూ అయింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ కెప్టెన్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్ తో గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గుజరాత్ జట్టులో చేరాడు. ఈ నేపథ్​యంలో కుమార్ కుశాగ్ర బెంచ్ కే పరిమితయ్యాడు. అటు ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. గత మ్యాచ్ లోని జట్టునే కొనసాగిస్తున్నట్లు కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.

జట్ల వివరాలు:

ఢిల్లీ క్యాపిటల్స్:

కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్.

గుజరాత్ టైటాన్స్:

శుభ్‌మన్‌ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.

ఇదిలాఉంటే ఢిల్లీ ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలను నమోదు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గుజరాత్ టైటాన్స్ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో (DC vs GT) ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగుతోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>