రాయలసీమలో రూ.3,000 కోట్లతో సోలార్ ప్రాజెక్ట్.. ఎల్లుండే ప్రారంభం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కూటమి ప్రభుత్వం రాయలసీమలో మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించనుంది. రూ.3,000 కోట్ల పెట్టుబడితో 600 మెగావాట్ల మెగా సోలార్ ప్రాజెక్ట్ (Mega Solar Project) ప్రారంభానికి సిద్ధమైంది. రాయలసీమలో రికార్డు స్థాయిలో కేవలం11 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసిన SAEL సోలార్ పవర్ ప్లాంట్ ను ఈ నెల 22న లాంఛ్ చేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

ఈ భారీ సౌర ప్రాజెక్ట్‌ను ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ (SAEL Industries) ప్రారంభించింది. కర్నూలులో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మొత్తం సమర్థం 600 మెగావాట్లు. ఈ సోలార్ ప్రాజెక్టును రెండు యూనిట్లుగా (300 MW చొప్పున) అభివృద్ధి చేశారు. SAEL Solar MHP1 Pvt Ltd, SAEL Solar MHP2 Pvt Ltd సంస్థలు ఈ ప్రాజెక్టుకు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. 2,400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విశాలంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. 12 లక్షల TOPCon బైఫేషియల్ సౌర మాడ్యూల్స్ ను వినియోయించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ను జాతీయ గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Solar Energy Corporation of India)తో 25 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుతో ఏడాదికి సుమారు 11 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు జరుగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>