బ‌ర్త్‌డే రోజున మంచు మ‌నోజ్‌ బిగ్ అనౌన్స్‌మెంట్‌..!

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ మంచు మ‌నోజ్ (Manchu Manoj) త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు భారీ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. త‌న కెరీర్‌లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టిస్తూ ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. టాలీవుడ్ న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna)తో క‌లిసి ఆయ‌న కొత్త చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మాస్ డైరెక్ట‌ర్ గోపీ చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు బిల్డ్ అవుతున్నాయి ఈ సంద‌ర్భంగా ఈ పుట్టిన రోజు త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అని, మ‌ర‌పురాని బ‌హుమ‌తిని ఇచ్చింద‌ని మ‌నోజ్ ఆనందం వ్య‌క్తం చేశాడు.

ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మ‌నోజ్ మాట్లాడుతూ.. బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేనిల‌తో త‌న‌కున్న ప్ర‌త్యేక అనుబంధం , గౌర‌వం కార‌ణంగా ఈ సినిమా త‌న మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. త‌న ఫ్యూచ‌ర్ లైన‌ప్‌లో ఈ మూవీ చాలా స్పెష‌ల్ అని, థియేట‌ర్ల‌లో అభిమానుల‌కు ఇది ఒక సాలిడ్ విజువ‌ల్ ట్రీట్‌లా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ వెయిటింగ్‌కు, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఈ సినిమా ఎంతో అద్భుతంగా రాబోతుంద‌ని హామీ ఇచ్చారు. ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే త‌న‌కు బ‌ర్త్ డే సంద‌ర్భంగా విషెస్ చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికీ మ‌నోజ్‌ ఎక్స్ వేదిక‌గా థ్యాంక్స్ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>