తెలంగాణకు రెండో మణిహారం RRR : సీఎం రేవంత్

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రాజెక్టులపై సీఎం రేవంత్ (Revanth) మాట్లాడారు. తెలంగాణకు త్రిబుల్ ఆర్ రెండో మణిహారం అని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్లు ఉంటే.. రీజినల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. దీని వల్ల హైదరాబాద్ రూపు రేఖలే మారిపోతాయని చెప్పారు. త్రిబుల్ ఆర్ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ రూపు రేఖలు మార్చాలనే ఉద్దేశంతోనే తాము ప్యూర్ ను తీసుకొచ్చామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలో కంపెనీలను తరలించి.. ఫ్యూచర్ సిటీని అక్కడ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం నుంచి పర్మిషన్ వచ్చేసిందని.. దానికి 161ఏఏ నెంబర్ కూడా ఇచ్చిందని సీఎం రేవంత్ (Revanth) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇదొక్కటే కాకుండా రీజినల్ రింగ్ రైలు కూడా కేటాయించిందని తెలిపారు. ఇలా కేంద్రం నుంచి చాలా ప్రాజెక్టులను తమ ప్రభుత్వం సాధిస్తుందని.. వీటి వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఇలాంటి ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపడటం బీఆర్ ఎస్ మానుకోవాలని సీఎం సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>