కలం, వెబ్ డెస్క్: భారత జట్టు మాజీ స్పిన్నర్ అశ్విన్ (Ashwin) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన రిటైర్మెంట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో జడేజా, తాను ప్రధాన స్పిన్నర్లుగా ఉన్నప్పుడు, వాషింగ్టన్ సుందర్ ఆడినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత తాను బయటకు వెళ్లాల్సి వచ్చిందని , అప్పుడు తనకు తన టైమ్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చిందని.. అందుకే రిటైర్ మెంట్ నిర్ణయం తానే తీసుకున్నానని వెల్లడించారు. ఈ మేరకు హెడ్ కోచ్ గౌతం గంభీర్ వల్లే రిటైర్ మెంట్ తీసుకున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఖండించారు.
ఇందులో భాగంగా గౌతమ్ గంభీర్‌పై వచ్చిన ఫేవరిటిజం ఆరోపణలపై కూడా అశ్విన్ (Ashwin) క్లారిటీ ఇచ్చారు. గంభీర్ కోచ్‌గా తన పని చేస్తాడని.. టీమ్ కోసం అతను ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదేనని కితాబిచ్చారు. జట్టు కూర్పు కోసం తాను తప్పుకోవాలనుకున్నా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తప్పుకోవాలనుకున్నా అది ఓకేనని.. ఎందుకంటే అది గంభీర్ బాధ్యత అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, 2024 డిసెంబర్‌లో భారత్ – ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే, బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అప్పట్లో అందరిని షాక్ కు గురిచేసింది. 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే తర్వాత టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

