విజృంభించిన పరాగ్.. ఢిల్లీ టార్గెట్ 226

కలం, స్పోర్ట్స్ : జైపూర్ వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌ (RR vs DC) రాజస్థాన్ అభిమానులకు కన్నులపండగనే చెప్పాలి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు లేని విధంగా ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ విజృంభించాడు. ఎప్పుడూ పది, ఇరవై స్కోర్ మాత్రమే చేసే పరాగ్.. ఈ మ్యాచ్‌లో తొలిసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే వెనుదిరగడంతో మ్యాచ్ చేజారిపోయిందని అంతా అనుకున్నారు. అప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన జురెల్, పరాగ్ ఇద్దరూ అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్‌ను నిలబెట్టారు. జురెల్ 42 చేస్తే.. పరాగ్ 90 పరుగులతో అదరగొట్టాడు. మరోవైపు ఢిల్లీ జట్టులో ఈ మ్యాచ్‌తోనే ఎంట్రీ ఇచ్చిన స్టార్క్ కూడా తన మార్క్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో రాజస్థాన్ బ్యాటర్ల చేత మూడు చెరువుల నీళ్లు తాపించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాకులు తగిలాయి. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) క్లీన్ బౌల్డ్ కాగా, కాసేపటికే వైభవ్ సూర్యవంశీ (4) కూడా పెవిలియన్ చేరాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో పరాగ్, జురెల్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. కెప్టెన్ రియాన్ పరాగ్ కేవలం 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు సాధించి ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ (42) విలువైన పరుగులు జతచేశాడు. అయితే ఇన్నింగ్స్ చివరలో డోనోవన్ ఫెరీరా ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కేవలం 14 బంతులు ఎదుర్కొన్న ఫెరీరా 6 భారీ సిక్సర్లు బాది 47 పరుగులు చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు నమోదు కావడం విశేషం.

ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ తన అనుభవాన్నంతా ఉపయోగించి 3 వికెట్లు పడగొట్టాడు. భారీ స్కోరు నమోదవుతున్నా తన మార్క్ బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కైల్ జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీసినప్పటికీ పరుగులు నియంత్రించలేకపోయారు. ఇప్పుడు ఢిల్లీ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>