హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణ హత్య!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్య కలకలం రేపింది. పాత కక్షలను మనసులో పెట్టుకుని, రౌడీషీటర్ నందనవనం సూరి (Nandanavanam Suri)ని ప్రత్యర్థులు దారుణంగా నరికారు. టీకేఆర్ కాలేజ్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘోరం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అఫ్రోజ్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామంటూ నందనవనం సూరిని నమ్మించి పిలిపించాడు. అనంతరం పక్కా ప్రణాళికతో సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. 2024 జూన్ 7న మీర్‌పేట్‌లో జరిగిన మహమ్మద్ సల్మాన్ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంచలన హత్యపై కేసు నమోదు చేసిన మీర్‌పేట్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read Also: లాఠీలతో కొడుతారా?.. రాహుల్ గాంధీ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>