ఆత్మహత్య వెనుక అసలు కథ.. నవవరుడి మృతిపై వీడిన సస్పెన్స్!

​కలం, ఖమ్మం బ్యూరో : వివాహానికి ముందే వేరొకరితో ఉన్న ప్రేమ వ్యవహారం.. పక్కా ప్లాన్ ప్రకారం భర్తను వదిలించుకోవాలనే దుర్బుద్ధి.. చివరికి ఆ నవవరుడి ప్రాణాలనే తీసింది. ‘నీకు మగతనం లేదు’ అంటూ భార్య చేసిన మానసిక దాడికి, వేధింపులకు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి (Suicide) పాల్పడిన దారుణ సంఘటన ఖమ్మం (Khammam) జిల్లా రఘునాథపాలెం మండలంలోని రాంక్య తండాలో వెలుగుచూసింది.​

బాధితులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంక్య తండాకు చెందిన సదర్ లాల్‌కు ఈ ఏడాది మే నెలలో వివాహమైంది. నూరేళ్ల పంటగా సాగాల్సిన వారి వైవాహిక జీవితంలో పెళ్లయిన మూడో రోజు నుంచే విషాదం అలుముకుంది. “నీకు మగతనం లేదు” అంటూ భార్య అతడిని తీవ్రంగా అవమానించడం, నిత్యం వేధించడం ప్రారంభించింది.

​భార్య వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన సదర్ లాల్, తనపై వచ్చిన నిందను తుడిచేసుకోవడానికి, తన సమర్థతను నిరూపించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్టులు కూడా చేయించుకున్నాడు. వైద్య పరీక్షల్లో సదర్ లాల్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు స్పష్టం చేసినప్పటికీ, భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

​సదర్ లాల్ భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని, ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా చేసుకుని, ఎలాగైనా భర్తను వదిలించుకోవాలనే పక్కా వ్యూహంతోనే ఈ వేధింపులకు పాల్పడిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో నిజం తేలినా కావాలనే అతడిని మానసిక క్షోభకు గురిచేసి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ​

భార్య వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెందిన సదర్ లాల్ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యే తన కొడుకు ప్రాణాలు తీసిందని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: అన్ని రంగాలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం: భట్టి విక్రమార్క

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>