ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ స్పాట్ డెడ్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్, ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సు ఎదురెదురుగా అత్యంత వేగంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాద తీవ్రతకు డీసీఎం డ్రైవర్ తల తెగిపడి, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కాగా బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు ప్రయాణీకులకు గాయాలైనట్లు సమాచారం.

​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: తెలంగాణకు ఐఐఎం : కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>