రోల్ ఆన్ vs స్ప్రే పర్ఫ్యూమ్.. మీకు ఏది బెస్ట్?

కలం, వెబ్‌ డెస్క్ : పర్ఫ్యూమ్ ఇప్పుడు కేవలం సువాసన కోసం మాత్రమే కాదు.. స్టైల్, వ్యక్తిత్వానికి కూడా గుర్తుగా మారింది. ఎవరికైనా దగ్గరగా వెళ్లినప్పుడు వచ్చే సువాసనే చాలాసార్లు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తుంది. అయితే పర్ఫ్యూమ్ ఎంపికలో చాలామందికి ఒకే సందేహం ఉంటుంది. రోల్ ఆన్ (Roll on) వాడాలా? లేక స్ప్రే పర్ఫ్యూమ్ (spray perfume) బెటరా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో చూద్దాం.

రోల్ ఆన్ పర్ఫ్యూమ్ అంటే?

రోల్ ఆన్ పర్ఫ్యూమ్ చిన్న బాటిల్‌లో వస్తుంది. పైభాగంలో రోలింగ్ బాల్ ఉంటుంది. దీన్ని నేరుగా చేతి మణికట్టు, మెడ, చెవుల వెనుక భాగాల్లో రాసుకుంటారు. ఇవి ఎక్కువగా ఆయిల్ బేస్డ్‌గా ఉంటాయి. అందుకే సువాసన ఎక్కువసేపు నిలుస్తుంది. ప్రయాణాల్లో తీసుకెళ్లేందుకు కూడా ఇవి చాలా సులువు. చిన్న సైజ్‌లో ఉండటంతో బ్యాగ్ లేదా జేబులో ఈజీగా పెట్టుకోవచ్చు. పైగా స్ప్రేలా గాలిలో వృథా కాకుండా నేరుగా చర్మంపై పడుతుంది.

స్ప్రే పర్ఫ్యూమ్ ప్రత్యేకత ఏంటి?

స్ప్రే పర్ఫ్యూమ్ ప్రపంచంలో ఎక్కువగా వాడే ఫార్మాట్. బాటిల్‌పై ఉన్న నాజిల్ ద్వారా మిస్ట్‌లా స్ప్రే అవుతుంది. ఇవి ఎక్కువగా ఆల్కహాల్ బేస్డ్‌గా ఉంటాయి. అందుకే త్వరగా ఆరిపోతాయి, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. ఒక్కసారి స్ప్రే చేస్తే పెద్ద ఏరియాలో సువాసన వ్యాపిస్తుంది. పార్టీలు, ఫంక్షన్లు, అవుటింగ్స్‌కి వెళ్లే సమయంలో చాలామంది స్ప్రే పర్ఫ్యూమ్‌లనే ఇష్టపడతారు.

రెండింటి మధ్య ప్రధాన తేడాలు

రోల్ ఆన్ పర్ఫ్యూమ్ ఎక్కువ కాన్సన్‌ట్రేషన్‌తో ఉంటుంది. అందుకే ఎక్కువసేపు నిలుస్తుంది. స్ప్రే పర్ఫ్యూమ్ మాత్రం లైట్‌గా ఉంటుంది. కానీ సువాసన దూరం వరకు వెళ్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి రోల్ ఆన్ బెటర్‌గా భావిస్తారు. ఇందులో ఆల్కహాల్ తక్కువగా ఉండటంతో చర్మంపై ఇర్రిటేషన్ తగ్గుతుంది. స్ప్రే పర్ఫ్యూమ్‌లలో ఆల్కహాల్ ఎక్కువగా ఉండటంతో కొందరికి డ్రైనెస్ కలిగే అవకాశం ఉంటుంది.

ఎవరికీ ఏది బెటర్?

రోజంతా సువాసన ఉండాలని కోరుకునేవారికి, తరచూ ట్రావెల్ చేసే వారికి రోల్ ఆన్ మంచి ఎంపిక. ఆఫీస్ బ్యాగ్‌లో కూడా సులభంగా తీసుకెళ్లొచ్చు. త్వరగా రెడీ కావాలనుకునేవారికి, స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ ఇష్టపడేవారికి స్ప్రే పర్ఫ్యూమ్ బాగా సరిపోతుంది. ముఖ్యంగా పార్టీలు, సోషల్ ఈవెంట్స్‌కి వెళ్లేటప్పుడు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>