Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్, డీజిల్ ధరలపై చంద్రబాబును నిలదీసిన జగన్‌

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan), ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబును (Chandrababu) విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని జగన్‌ ప్రశ్నించారు. 2015లో చంద్రబాబు ప్రభుత్వం పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 అదనంగా పెంచిందని, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌తో పాటు మరో రూ.4 భారం వేసిందని ఆరోపించారు. కోవిడ్‌ సమయంలో తమ ప్రభుత్వం రోడ్‌ సెస్‌ పేరుతో కేవలం రూపాయి మాత్రమే పెంచిందని జగన్‌ పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ రాజకీయ డ్రామాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం లీటర్‌ పెట్రోల్‌పై కనీసం రూ.8 తగ్గించాలని జగన్‌ (YS Jagan) డిమాండ్‌ చేశారు.

Read Also: వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>