Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్యాంగం vs రాజకీయం.. వివాదంలో తమిళనాడు గవర్నర్!

కలం, వెబ్ డెస్క్ : భారత రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ ఉన్నతమైన రాజ్యాంగబద్ధమైన పదవి. గవర్నర్ రాష్ట్రానికి అధినేతగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి, రాష్ట్రానికి వారధిగా నిలవాలి. అయితే, ఇటీవలి రాజకీయ పరిణామాలు గవర్నర్ వ్యవస్థ (Governor Role)పై మరోసారి చర్చకు దారితీసింది. తమిళనాడు (Tamil Nadu) లో కొనసాగుతున్న పరిణామాలతో గవర్నర్ గిరిపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారుతుంది.

ఈ క్రమంలో తమిళనాడులో మెజారిటీ సీట్లు సాధించిన టీవీకే పార్టీ గవర్నర్ ను రెండు సార్లు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. అయితే, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ లోక్ భవన్ లో మెజారిటీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఇవ్వాలని కోరారు. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాలు బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్లు బీజేపీకి ఏజెంట్లుగా మారారని ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. అత్యధిక మెజారిటీ సాధించిన టీవీకే అధినేత విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. అతిపెద్ద రాజకీయ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం ప్రధానమైనది. లేదా ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమిని ఆహ్వానించొచ్చు. అలాగే, ఎన్నికల తర్వాత మెజారిటీ నిరూపించుకునే కూటమికి అవకాశం ఇవ్వడం లాంటివి గవర్నర్ సాధారణంగా పాటించాల్సి ఉంటుంది. ఇవి రాజ్యాంగంలో ప్రస్తావించకపోయినా.. సుప్రీం కోర్టు తీర్పులు, పలు కమిషన్ల నివేదికలు వీటిని అనుసరించాలని సూచించాయి.

పార్టీ బలం లోక్ భవన్ లో నిరూపించుకునేది కాదని శాసన సభలో నిరూపించుకునేది అని ప్రతిపక్షాలు చెబుతన్నాయి. కానీ, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి గవర్నర్ రాజకీయ స్వలాభం కోసం నిబంధనలు పక్కకు పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రజా నిర్ణయాలను పక్కనపెట్టి గవర్నర్ విచాక్షణాధికారాలను విస్తృతంగా వినియోగిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్య బద్ధ పదవుల్లో ఉన్నవారు ప్రజల తీర్పు, శాసన సభ ప్రాముఖ్యతకు అనుగుణంగా నడుచుకోవాల్సి అవసరం ఉందని అభిప్రాయాలు వెల్లివెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>