Mobile Popup Ad
Mobile Popup Ad

800 ఏండ్ల శివాలయం కూల్చివేత.. స్పందించిన కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌ సమీపంలోని శివాలయం కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని వారి మూర్ఖుల పాలన తెలంగాణలో కొనసాగుతున్నది అని ఆయన (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.

800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణం అని కేటీఆర్ ధ్వజమెత్తారు. హైడ్రా ద్వారా వేల ఇండ్లను కర్కషంగా కూల్చడంతో పాటు లక్షల చెట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నరికింది అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదని ఆయన ఆరోపించారు. తక్షణమే ఈ విధ్వంసం ఆపి శివాలయాన్ని పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>