Mobile Popup Ad
Mobile Popup Ad

ఉగాది రోజు పవన్ కళ్యాణ్‌ ఎక్కడున్నారు : రోజా

కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎంపై మాజీ మంత్రి రోజా (Roja) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతసేపు జగన్ మీద నిందలు వేయడానికే టైమ్ కేటాయించే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఉగాది రోజున సతీసమేతంగా ఎందుకు పంచాంగ శ్రవణం జరపలేదని రోజా ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్, భారతి కలిసి సంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం జరిపి ఉగాది శుభాకాంక్షలు తెలిపారని.. కానీ సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఎందుకు శుభాకాంక్షలు తెలపలేదని రోజా మండిపడ్డారు.

సనాతన ధర్మ యోధుడిని అని, హిందూ కల్చర్ ను కాపాడటానికే పుట్టానని బిల్డప్ లు కొట్టే పవన్ కల్యాణ్ సతీసమేతంగా పంచాంగ శ్రవణం ఎందుకు నిర్వహించలేదని.. ఎందుకు రాష్ట్ర ప్రజలకు భార్యతో కలిసి శుభాకాంక్షలు తెలపలేదని రోజా (Roja) ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు కూడా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయకుండా టీటీడీని అవమానించారంటూ రోజా మండిపడ్డారు. వెంటనే బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చుకుండా తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తోందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రైతులకు పంటనష్టపరిహారం ఇవ్వకుండా, మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకుండా కూటమి మోసం చేసిందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>