యశోదలో రోబోటిక్ ద్వారా టిబీ వ్యాధికి చికిత్స

కలం, కరీంనగర్ బ్యూరో : హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్‌ (Yashoda Hospitals)లో రోబోటిక్ సర్జరీ ద్వారా ట్యూబర్‌క్యులోసిస్ (టిబీ) వ్యాధికి చికిత్స విజయవంతమవుతున్నట్లు డాక్టర్ మంజునాథ్ బాలే, సీనియర్ థొరాసిక్ సర్జన్ తెలిపారు. కరీంనగర్‌కు చెందిన 24 సంవత్సరాల మహిళకు టిబీ వ్యాధిని రోబోటిక్ శస్త్రచికిత్సతో విజయవంతంగా పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.

బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బాలే మాట్లాడుతూ.. మల్టీడ్రగ్-రెసిస్టెంట్ టిబీ (ఎండిఆర్-టీబీ) భారతదేశంలో ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందని చెప్పారు. సాధారణ టిబీ మందులకు లొంగని వ్యాధిని ఎండిఆర్-టీబీగా పరిగణిస్తారు. దీని చికిత్స క్లిష్టమైనదని, డ్రగ్ థెరపీ పునాది అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శస్త్రచికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమని వివరించారు.

వైరస్ ఊపిరితిత్తుల భాగాన్ని ప్రభావితం చేసినప్పుడు, నిరంతర ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు, ఊపిరితిత్తులు దెబ్బతిన్న సందర్భాల్లో లోబెక్టమీ, సెగ్మెంటెక్టమీ వంటి ఆధునిక శస్త్రచికిత్సలను సూచిస్తారు. వ్యాధి నిర్వహణలో పల్మోనాలజిస్టులు, సర్జన్లు, మైక్రోబయాలజిస్టులు సమన్వయం రోగి ప్రాణాలను కాపాడుతుందని ఆయన అన్నారు. డాక్టర్ బాలే, టిబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించమని, మందులు ఉపయోగంలో ఎలాంటి విరామం ఇవ్వరాదు అని సూచించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఆ మహిళ, ఆమె తండ్రి యశోద హాస్పిటల్ (Yashoda Hospitals) వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>