హరీశ్ రావు సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్: వనపర్తిలో (Wanaparthy) బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బుధవారం హైకోర్టు (High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ నిర్వహించుకోవడానికి అనుమతి లేదంటూ ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అయితే తన సభ కోసం అనుమతి కావాలంటూ ఎస్పీకి హరీశ్ రావు విన్నవించుకున్నారు. దీనిపై సుదీర్ఘంగా సంబంధిత అధికారులతో విచారించిన ఎస్పీ.. తొలుత సభ పెట్టుకోవచ్చని అనుమతి ఇచ్చి నేడు పర్మిషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సభకు అనుమతి నిరాకరణతో హరీశ్ రావు (Harish Rao) అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై హైకోర్టుకి వెళ్లగా.. ఎస్పీ ఆదేశాలను రద్దు చేస్తూ సభ నిర్వహించుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్‌కు (Gollapalli Reservoir) వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా హరీశ్ రావు సభా వేదికగా నిరసన తెలుపనున్నారు. హరీశ్ సభకు పర్మిషన్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>