Mobile Popup Ad
Mobile Popup Ad

హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాద మృతులే ఎక్కువ: వరంగల్ సీపీ

కలం, వరంగల్ బ్యూరో: గత సంవత్సరంలో హత్యలు, ఇతర ఇష్యూస్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది మరణిస్తే, కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది చనిపోయారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించని కారణంగా యువత తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ (Hanamkonda)లోని వాగ్డేవి కళాశాల సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన జరిగింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పోలీసులు విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌ గురించి వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. తన ప్రాణాన్ని కాపాడుకుంటూ, ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.

థ్రిల్ కోసం డ్రైవింగ్ (Driving) చేయడం ప్రమాదమని, ఈక్రమంలో చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపాల్సిందిగా చెప్పాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారయణ, ఇన్స్‌స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్స్‌పాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి, హరిచంద్ర రెడ్డి పాల్గొన్నారు.

Read Also: సీఎం క్యాంప్ ఆఫీస్‌కు హై సెక్యూరిటీ.. ఆ వాల్ కోసం రూ. 9 కోట్ల ప్రాజెక్టు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>