Mobile Popup Ad
Mobile Popup Ad

మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్న సర్పంచ్

కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని చర్ల మండలం సత్యనారాయణపురం సర్పంచ్ చిక్కాల గౌతమి మీసేవ నడుపుతున్నారు. రెండు ప్రభుత్వ ప్రయోజనాలు ఏక కాలంలో ఎలా పొందుతారని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మీ సేవ ను వదిలేసి ఉంటే మరో కుటుంబానికి ఉపాధి దొరికేదని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ రాజ్ చట్టానికి తూట్లు పొడుస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం సహాయ కార్యదర్శి కారం సురేష్ స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందచేశారు. దీనిపై జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>