తిలక్‌నగర్‌ చౌరస్తాలో మళ్లీ కుంగిన రోడ్డు

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్ సమీపంలో ఉన్న తిలక్‌నగర్ (Tilak Nagar) చౌరస్తాలో గురువారం ఉదయం ఒక్కసారిగా ప్రధాన రహదారి కుంగిపోయింది. వాహనాల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడటాన్ని గమనించిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించారు. వారు వెంటనే వాహనాల రాకపోకలను నిలిపివేసి, గుంత చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతం కింద పెద్ద నాలా ప్రవహిస్తుండటమే రోడ్డు కుంగిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సరిగ్గా ఆరు నెలల క్రితం కూడా ఇదే ప్రదేశంలో రోడ్డు కుంగిపోవడం గమనార్హం. పదేపదే అదే చోట రోడ్డు దెబ్బతింటుండటంతో స్థానికులు, వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>