Mobile Popup Ad
Mobile Popup Ad

కళ్లల్లో కారం చల్లి ఆర్ఎంపీపై దారి దోపిడి..

కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం, గుండ్లపల్లి క్రాస్ రోడ్డుకు చెందిన తమ్మనవేణి కొమురయ్య ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఆయన తిమ్మాపూర్ (Thimmapur) మండలం నేదునూరు గ్రామంలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో దారిలో ఒక వ్యక్తి లిఫ్ట్ అడగగా అతడు బైక్ వేగాన్ని తగ్గించాడు. వెంటనే అవతలి వ్యక్తి ఒక్కసారిగా కొమురయ్య కళ్లల్లో మిరపపొడి చల్లాడు.

అదే సమయంలో వెనుక నుంచి మరో వ్యక్తి వచ్చి కొమురయ్యను పట్టుకున్నాడు. తర్వాత వారిద్దరు అతడి మెడలోని సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును, జేబులో ఉన్న రూ.1000 నగదును బలవంతంగా లాక్కున్నారు. అంతేగాక అతడి తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత సమీపంలోని రవీందర్ రెడ్డి మామిడి తోట వైపు పారిపోయారు. బాధితుడు ఫిర్యాదు మేరకు తిమ్మాపూర్ (Thimmapur) పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో హాఫ్‌డే స్కూళ్ల తేదీలు ఖరారు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>