తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు (Rising Temperatures) పెరిగిపోతున్నాయి. గతవారం వరకు వర్షాలు కురవడంతో కాస్త చల్లని వాతావరణం నెలకొంది. గత మూడు రోజులుగా వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. తెలంగాణలో ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న 10 రోజుల పాటు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండబోతోందని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న 10 రోజుల పాటు, అంటే ఏప్రిల్ 22వ తేదీ వరకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం నుంచే భగ్గుమనే వేడితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల మార్కు దాటిపోయింది. నల్గొండ జిల్లా ఘనపూర్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో కూడా 41 డిగ్రీల వరకు ఎండలు కాసే ఛాన్స్ ఉంది.

అటు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి (Rising Temperatures). మే నెల నాటికి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే చివరి వారంలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ఏర్పడే తీవ్ర వడగాలులు మధ్యప్రదేశ్ మీదుగా కర్ణాటక నుంచి రాయలసీమలోకి ప్రవేశించనుంది. అక్కడినుంచి రాష్ట్రమంతా వడగాడ్పులు వ్యాపించనున్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటాయి. ఈ ఏడాది శక్తిమంతమైన ఎల్నినో ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై ఏప్రిల్ చివరి నాటికి క్లారిటీ వస్తుందని ఏయూ వాతావరణశాఖ ఆచార్యురాలు సునీత పేర్కొన్నారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>