Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ ఎంపీలకు ‘విప్’ జారీ.. మూడు రోజుల అటెండెన్స్ మస్ట్

కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీలందరికీ ఆ పార్టీ నుంచి విప్ జారీ అయింది. కీలకమైన పార్లమెంటు సెషన్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఆబ్సెంట్ కావొద్దని, తప్పనిసరిగా హాజరు కావాలని ఆ విప్ మెసేజ్‌లో బీజేపీ (BJP) పార్లమెంటరీ పార్టీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కీలకమైన బిల్లులపై ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల సెషన్‌లో చర్చ జరగనున్నందున అవి ఆమోదం పొందేందుకు వీలుగా బీజేపీ ఈ విప్ జారీ చేసింది. మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు, జమిలి ఎన్నికలు, లోక్‌సభ-శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్, యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) లాంటి కీలకమైన అంశాలపై చట్టాలను చేయాలనుకుంటున్నందున బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నది.

ఈ బిల్లులు పార్లమెంటు సెషన్‌లో చర్చకు వస్తాయన్న ఉద్దేశంతోనే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై అనుసరించాల్సిన వ్యూహంపై, పార్టీ పాలసీపై చర్చించింది. ఇప్పుడు బీజేపీ (BJP) సైతం ఎట్టి పరిస్థితుల్లో బిల్లులకు ఆమోదం లభించి చట్టాలుగా మారేందుకు తనదైన శైలిలో విప్ ఇచ్చింది. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలు సైతం ఇలాంటి విప్ జారీచేయనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ నెల 16న విపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నది.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>