రేవంత్ మరో సువేందు అధికారి అని కామెంట్స్.. అద్దంకి దయాకర్ ఏమన్నారంటే..?

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ మధ్య ఉన్న సత్సంబంధాలపై బీజేపీ ఎంపీధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నాడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉండి, ఆ తర్వాత బీజేపీలో చేరిన సువేందుకు అధికారితో రేవంత్ రెడ్డిని అరవింద్ పోల్చడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ ను కలిసిరావాలని పిలుపునివ్వడంపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar ) బీజేపీ ఎంపీ అరవింద్ పై ఫైర్ అవుతూ.. సీఎం రేవంత్ ను ప్రధాని మోదీ కలిసి రావాలని వ్యాఖ్యానించడంపై క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ధర్మపురి అరవింద్ ఒక కిరాయి నాయకుడని ఫైర్ అయ్యారు. అర్వింద్‌కు బుద్ధి లేదని, డీఎస్ కొడుకు కాకపోతే ఆయనకు రాజకీయ జీవితమే లేదని విమర్శించారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్‌కు సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధతను శంకించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ.. సీఎం రేవంత్‌ను కలిసి రావాలని కోరారని వెల్లడించారు. కేవలం పబ్లిసిటీ కోసం ఇరు పార్టీల మధ్య అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడుతున్న అరవింద్ ను బీజేపీ అధిష్టానం కూడా ఎప్పటికీ గుర్తించదని చెప్పారు. ప్రస్తుతం ఆయన సొంత పార్టీలోనే ఒంటరి అవుతున్నారని ఎద్దేవా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>