Mobile Popup Ad
Mobile Popup Ad

శాంతిభద్రతల విషయంలో రాజీపడని ప్రభుత్వం : ఆంజనేయులు గౌడ్

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) ‘పీఎంజే’ నగల దోపిడీ కేసును కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఛేదించి, అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలంకి , పోలీసు బృందానికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

దొంగతనం జరిగిన 11 రోజుల్లోనే దుండగులను పట్టుకోవడం పోలీసు శాఖ చిత్తశుద్ధికి, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై ప్రతిపక్షాలు కావాలని దుష్ప్రచారం చేయాలని ఉబలాటపడటం సిగ్గు చేటని ఆయన ధ్వజమెత్తారు. పోలీసులు రేయింబవళ్లు కష్టపడి కేసును ఛేదిస్తుంటే, ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇంట్లో కూర్చొని అసత్య ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థపై పౌరులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు గౌరవంగా, హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే పోలీసులను అభినందించాలే తప్ప, రాజకీయ లబ్ధి కోసం నిందలు వేయడం మానుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేరస్తులు ఎంతటివారైనా తప్పించుకోలేరని, ఇదే ఘటన దానికి నిదర్శనమని ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తాడిజెర్రి సర్పంచ్ రామిడి రాజిరెడ్డి, కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ నూనె గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వంగల విద్యాసాగర్, కుంబాల రాజ్ కుమార్, గంగుల దిలీప్ కుమార్, బండిపెల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>