epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కేసీఆర్‌పై రేవంత్ శపథం

కలం, వెబ్ డెస్క్: ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వనని సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గీలో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. కేసీఆర్ మీద తాను కక్ష సాధించడం లేదని పేర్కొన్నారు. ఒక వేళ కక్ష సాధించి ఉంటే ఎప్పుడే జైళ్లో పెట్టించేవాడినన్నారు. కేసీఆర్ తనకు తానే ఫామ్ హౌస్‌లో బంధీ అయ్యారని పేర్కొన్నారు. ఆయనకు తమ పోలీసులే కాపలాగా ఉన్నారన్నారు. ఇటీవల కేసీఆర్ తోలు తీస్తాం అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్ నువ్వు కొడంగల్‌కు వస్తావా? మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచ్ లు వచ్చి నీ తోలు తీస్తారు. నిన్ను చింతమడకలో వేలాడదీసి కొడతారు. కేసీఆర్‌వి స్థాయి లేని మాటలు సోయి లేని మాటలు‘ అంటూ తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే

తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ ఫ్యామిలీని అధికారంలోకి రానివ్వబోన్నారు. ’ఈ గడ్డమీద నుంచి నేను శపథం చేస్తున్నాను. కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే. చింతమడకలో చీరి చింతకు కడతాం. మీ గత చరిత్రతో ఒరిగేది ఏమీ లేదు. కంటోన్మెంట్‌లో బండకేసి కొట్టినం, జూబ్లీహిల్స్‌లో బొందపెట్టినం. సర్పంచ్ ఎన్నికల్లో 8 వేల స్థానాలు గెలుచుకున్నాం. ఇన్నిసార్లు ఓడిపోయినా కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రావడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్‌కు బుద్ధి రావడం లేదు

‘ఎన్నిసార్లు ఓడిపోయినా కేసీఆర్ కు బుద్ధి రావడం లేదు. ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలకు భయపడేవారు ఎవరూ లేరు. పొంకనాల పోసిరెడ్డికి మూడు ఎడ్లు ముప్పై మూడు దొడ్లు అన్నట్టుగా కేసీఆర్ బీరాలు పలుకుతున్నారు.‘ కేసీఆర్ (KCR) అసెంబ్లీకి ఎప్పుడు వస్తారో చెప్పాలన్నారు. ఏ విషయం మీదైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నీళ్ల మీద అయినా.. నియామకాల మీద అయినా కల్యాణ లక్ష్మి మీద అయినా దేని మీదైనా చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.

పాలమూరుకు అన్యాయం

పాలమూరు (Palamuru) నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ జిల్లాలో ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తాము ఆ అప్పులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.

Read Also: ఫ్లై ఎక్స్​ప్రెస్​ ఫ్లైట్స్ @ తెలంగాణ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>