epaper
Tuesday, November 18, 2025
epaper

ప్రైవేటు విద్యాసంస్థలకు సీఎం వార్నింగ్ ..

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలు చేపట్టిన బంద్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. “మా పాలనలో పేరుకుపోయిన బకాయిలు ముందుగా చెల్లిస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. బకాయిలు ఇవాళ కాకపోతే రేపు వసూలవుతాయి. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి నిధులకు ఇబ్బంది లేదు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. రాష్ట్రానికి నెలకు 18 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. జీతాలు, వడ్డీలు, ఇతర ఖర్చులు తీసివేస్తే మిగిలేది 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఈ ఆదాయంతో రాష్ట్రాన్ని ఎలా నడపాలో చెప్పండి. ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? కాలేజీలను బంద్ చేయించినవారితో చర్చించేదేముంది? ఏ కాలేజీ ఎంత డొనేషన్ వసూలు చేస్తుందో నాకు తెలుసు.’ అంటూ సీఎం పేర్కొన్నారు.

ఇష్టానుసారం ఫీజులు పెంచుతారా?

‘కాలేజీలో నిబంధనలు పాటించకపోతే ఎలా? ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా? విద్య వ్యాపారం కాదు, విద్యను సేవగా భావించాలి. రాజకీయ నేతలు అండగా ఉన్నారని విద్యార్థులతో ఆడుకోవద్దు. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుని వచ్చి రీయింబర్స్‌మెంట్ అడుగుతున్నారు. కాలేజీలకు అనుమతుల విషయంలో ఎన్నో అక్రమాలు ఉన్నాయి. కాలేజీల యజమానులు ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తారా? బీసీ నేత ఆర్. కృష్ణయ్య కూడా అమాయకంగా వాళ్ల ఉచ్చులో పడ్డారు. ఆర్. కృష్ణయ్య, మందకృష్ణ ముందుకొస్తే వాళ్ల చేతికే చిట్టా ఇస్తా. నాలుగు నెలలు ప్రభుత్వాన్ని మీరే నడపండి” అని ముఖ్యమంత్రి(Revanth Reddy) అన్నారు.

బకాయిలు ఎంత ఉన్నాయి?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) పథకం కింద ప్రైవేట్ కాలేజీలకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 7500 కోట్లదాకా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో బీఆర్ఎస్ పాలనలోనూ చెల్లించాల్సినవి ఉన్నాయి. దీంతో విద్యాసంస్థల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారీతిన డొనేషన్లు వసూలూ చేస్తూ ప్రభుత్వం మీద పడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంలో పడిపోయాయి. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.

Read Also: కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ : రేవంత్ రెడ్డి

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>