ప్రముఖ క్రికెటర్ షమీ(Mohammed Shami), ఆయన మాజీ భార్య హసీన్ జహాన్(Hasin Jahan) విడాకుల కేసు మరో మలుపు తిరిగింది. తనకు షమీ భరణంగా ఇస్తున్న రూ. 4 లక్షలు సరిపోవని.. ఆ మొత్తాన్ని పెంచాలని అతడి మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం షమీకి నోటీసులు ఇచ్చింది. షమీ, హసీన్‌లకు 2014లో వివాహమైంది. 2015లో వీరికి కూతురు ఐరా జన్మించింది. 2018లో దంపతుల మధ్య మనస్ఫర్థలు రావడంతో భార్య హసీన్.. షమీపై గృహ హింస కేసు వేశారు. అప్పటి నుంచి వీరు విడిగా ఉంటున్నారు. 2023లో లోయర్ కోర్టు నెలకు షమీ తన భార్య హసీన్‌కు రూ.1.3 లక్షలు (హసీన్‌కు 50 వేలు, ఐరాకు 80 వేలు) ఇవ్వాలని ఆదేశించింది. అయితే హసీన్ ఈ భరణం సరిపోదంటూ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. 2024లో హైకోర్టు భరణాన్ని రూ.4 లక్షలకు (హసీన్‌కు 1.5 లక్షలు + ఐరాకు 2.5 లక్షలు పెంచింది. ఇప్పుడు హసీన్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఆమె నెలకు రూ.10 లక్షల వరకు కావాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో సుప్రీంకోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసు పంపింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని చెప్పింది.
కోల్‌కతాలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. షమీ తన ఐపీఎల్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కాబట్టి, తనకు మరింత మొత్తం మంజూరు చేయాలని కోరారు. అయితే షమీ తరఫు న్యాయవాదులు మాత్రం ఈ మొత్తం ఇప్పటికే భారీగా ఉందని, మరింత పెంచితే అతని ఆర్థిక భారం అవుతుందని చెబుతున్నారు.
విచారణ సమయంలో సుప్రీంకోర్టు జస్టిస్‌లు హసీన్ వాదనలపై తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తారు. “నెలకు రూ.4 లక్షలు చాలా ఖర్చు మంచి మొత్తమే కదా.. ఇంకా మరింత కావాలా?” అని కోర్టు ఆమెను ఆక్షేపించింది. ఈ మొత్తంలో హసీన్‌కు రూ.1.5 లక్షలు, కుమార్తె ఐరాకు రూ.2.5 లక్షలు జారీ అయ్యాయి.
కేసు నేపథ్యం
షమీ(Mohammed Shami)-హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. తర్వాత మనస్పర్థలు మొదలై, 2018లో హసీన్ షమీపై గృహ హింస, అక్రమ సంబంధాలు వంటి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు షమీ కెరీర్‌పై తాత్కాలిక ప్రభావం చూపింది.
Read Also: కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ : రేవంత్ రెడ్డి
Follow Us on : Pinterest

