కలం, వెబ్ డెస్క్ : ‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను బతికున్నంత కాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివ్వను’ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీళ్ల విషయంలో, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మేమంతా ఏకాభిప్రాయంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల కోసం పోరాడుతామన్నారు. చచ్చినా తెలంగాణ కోసం చస్తాం.. బతికానా తెలంగాణ కోసం బతుకుతామని తెలిపారు. ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే తన ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పదేపదే తనకు ఇంగ్లీష్ రాదంటూ.. మెస్సీతో ఏ భాషలో మాట్లాడరని.. అసలేం మాట్లాడరంటూ అవహేళన చేశారన్నారు. చైనా, జపాన్, జర్మనీ వాళ్లకు ఇంగ్లీష్ వచ్చా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మెస్సీకి కూడా స్పానిష్ తప్ప ఏమీ రాదన్నారు. ఆటగాడికి ఆట రావాలని, పాలకుడికి పాలించడం తెలిస్తే సరిపోతుందన్నారు. ఏ సమస్యకైనా చర్చలతో పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు.
Read Also: ఆ ఒక్క సంతకం.. తెలంగాణకు మరణశాసనం: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)


