కుదిరిన ఒప్పందం.. కొత్తగూడెం ఉత్కంఠకు తెర

కలం, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి జోక్యంతో కొత్తగూడెం కార్పొరేషన్ వ్యవహారంలో ఉత్కంఠకు తెర పడింది (Kothagudem Mayor). మేయర్​ పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు సీపీఎం, కాంగ్రెస్​ నిర్ణయించాయి. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మొదట సీపీఎంకు మేయర్​ పీఠం దక్కనుంది. సీపీఎం నేతలతో చర్చల అనంతరం టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఇరు పార్టీల నేతలు మేయర్​తోపాటు డిప్యూటీ మేయర్​ పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, సీపీఐతో పొత్తు పెట్టుకుంటామని కేటీఆర్​ ఆఫర్​ ఇచ్చినా.. సీఎం రేవంత్​ రెడ్డి జోక్యంతో సీన్ రివర్స్​ అయ్యింది.

గంట గంటకూ ఉత్కంఠ..

అంతకుముందు శనివారం రాత్రి వరకు కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation) మేయర్ పీఠంపై గంట గంటకూ సమీకరణలు మారాయి. సీపీఐతో కలసి వస్తారనుకున్న ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు మారినట్లు చర్చ జరిగింది. అయితే 51వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్​గా గెలిచిన కార్పొరేటర్ దుర్గా ప్రసాద్ మాత్రం సీపీఐతో ఉండడం వల్ల, ఎక్స్​అఫీషియో మెంబర్​తో కలిపి ఆ పార్టీకి 24 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్​ చేరాలంటే ఇంకా ఏడుగురి మద్దతు కావాలి. బీఆర్ఎస్​కు 8 మంది ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ మద్దతు లేకపోయినా సీపీఐకి మేయర్ పీఠం దక్కే అవకాశాలు కనిపించాయి.

మరో పక్క కాంగ్రెస్​తో ఐదుగురు ఇండిపెండెంట్లు టచ్​లో ఉన్నారనుకున్నా.. ఎక్స్​అఫీషియో, సీపీఎంతో కలిపి ఆ పార్టీకి 29 సీట్లు అవుతున్నాయి. అయినా, ఇంకా ముగ్గురు కార్పొరేటర్ల మద్దతు అవసరం. అదే సమయంలో బీఆర్​ఎస్​లోని ముగ్గురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్​తో టచ్​లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సీపీఐ రాష్ట్ర కమిటీ జూమ్ మీటింగ్​ జరిగింది. సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారనేది బయటకు రాలేదు. కానీ, ఆ పార్టీ తమ కార్పొరేటర్లను రహస్య ప్రదేశానికి తరలించింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy).. హంగ్​ ఉన్న కార్పొరేషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మంత్రులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలోనే కొత్తగూడెం కార్పొరేషన్​పై చర్చించారు(Kothagudem Mayor). అనంతరం సీపీఐ నేత పల్లా వెంకట రెడ్డితో సీఎం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తర్వాత మిగిలిన పనిని టీపీసీసీ చీఫ్​, మంత్రి పొంగులేటి పూర్తి చేశారు.

Read Also: ఇస్నాపూర్‌లో హంగ్.. ఎంపీ రఘునంద‌న్ బిగ్ ట్విస్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>