ఇస్నాపూర్‌లో హంగ్.. ఎంపీ రఘునంద‌న్ బిగ్ ట్విస్ట్

క‌లం మెద‌క్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ ర‌ఘునంద‌న్ రావు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి ప్రాతినిధ్యంలేని ప‌టాన్ చెరువు ప‌రిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో (Isnapur Municipality) ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకొవ‌డంపై చ‌ర్చ న‌డుస్తుంది. ఇస్నాపూర్ లో బీజేపీ నుంచి ఎవరు విజయం సాధించకపోయినా ఆయన ఓటు నమోదు చేసుకున్నారు. దీనిపై మూడు పార్టీల నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటిలీ మొత్తం 26 వార్డుల్లో 12 బీఆర్ఎస్, 10 కాంగ్రెస్, 4 స్థానాల్లో స్వతంత్రులు విజ‌యం సాధించారు. చైర్మన్ స్థానాన్ని కావ‌ల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ 14 రాక‌పోవ‌డంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి.

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక‌రు కాంగ్రెస్‌ (Congress)తో టచ్‌ ఉన్నారు. శనివారం ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి చేరడంతో బీఆర్ఎస్ బ‌లం 12కి చేరింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటును ఇస్నాపూర్‌లో న‌మోదు చేసుకున్నాడు. దీంతో చైర్మన్ పీఠాన్ని కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ సైతం పావులు కదుపుతోంది.

మెదక్ పార్లమెంట్ నియోజ‌కవ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మ‌ధు భార్య క‌విత‌ను చైర్ పర్సన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముగ్గురు స్వతంత్రులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంతో కాంగ్రెస్ బలం ఒక్కసారిగా 13కి పెరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి కూడా టచ్‌లో ఉండటంతో కాంగ్రెస్ బలం 14కు పెరిగినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి ఎలాంటి అవ‌కాశం లేక‌పోయిన‌ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) ఇస్నాపూర్ మున్సిపాలిటిలో (Isnapur Municipality) ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకొని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Read Also: కాంగ్రెస్ అభ్యర్థికి షాక్.. రూ.7 కోట్లు ఖర్చు చేసినా తప్పని ఓటమి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>