Mobile Popup Ad
Mobile Popup Ad

బావబామ్మర్దులపై సీఎం రేవంత్ పిట్టకథ..!

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం పై ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్ రావు మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ అడ్డుపడుతుందని విమర్శించారు. ఈ మేరకు ఓ పిట్టకథను సభలో ప్రస్తావించారు. ఆనాడు రాక్షసుల గురువు శుక్రచార్యుడి శిష్యులు మారీచుడు, సుబాహుడు ప్రజల సంక్షేమం కోసం ముణులు  నిర్వహించే యజ్ఞ యాగాదులను ధ్వంసం చేసేవారని తెలిపారు. యగ్నాలపై మాంసపు ముక్కలను, మద్యాన్ని పోసి  భగ్నం చేసేవారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మారీచుడు, సుభాహుడిలాగా ఓ ఇద్దరు విధంగా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు  ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావును ఉద్దేశించే సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని వారించారు. దీంతో సభలో ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>