కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన ఉదయం 11:30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరగబోయే ఈ భేటీకి ముందు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి చర్చలు జరపనున్నారు.
ఇప్పటికే నిన్న సీఎస్ సంజయ్ జాజుతో ఉద్యోగ సంఘాల నేతలు మొదటి దఫా చర్చలు పూర్తి చేశారు. ఈ క్రమంలో నేడు సీఎంతో జరిగే సమావేశానికి ముందు డిప్యూటీ సీఎంతో పాటు సీఎస్తో మరో దఫా చర్చలు జరిపి తమ డిమాండ్లను వారి ముందుంచనున్నారు. అనంతరం సాయంత్రం 6:00 గంటలకు డిప్యూటీ సీఎం భట్టితో కూడా మరో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఈ సమావేశాల్లో సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉండటంతో, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వివరాలను సంఘం చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు.

