ఆదిలాబాద్‌ రిమ్స్‌ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి విచారం

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పేలుడు సంభవించి వార్డులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు పసికందులు మృతి చెందడం అత్యంత బాధాకరమని సీఎం పేర్కొన్నారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఘటనపై సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. ప్రమాదంలో గాయపడిన, పొగ కారణంగా అస్వస్థతకు గురైన చిన్నారులకు అత్యున్నత స్థాయి అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదంపై సమగ్ర సాంకేతిక విచారణ చేపట్టి తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో భద్రతా చర్యలను తక్షణమే పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>