కలం, వెబ్ డెస్క్: జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ లతో పాటు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.
కొందరు పెద్ద నాయకులు పార్టీని వీడి వెళ్లినప్పటికీ, తామంతా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలోనే కొనసాగుతామని స్థానిక నాయకులు ముఖ్యమంత్రికి తెలిపారు. నాయకులు వెళ్లినా కార్యకర్తలు, ప్రజలు పార్టీ వెంటే ఉన్నారని వారు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్తామని, ప్రజలకు ప్రభుత్వ ఫలాలను వివరించడంలో ముందుంటామని నేతలు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో అందరం కలసికట్టుగా పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి నేతలు వివరించారు.
Read Also: డీలిమిటేషన్ ప్రక్రియ.. సౌత్ ముఖ్యమంత్రులకు సీఎం లేఖ
Follow Us On : WhatsApp

