మోదీ చర్యలతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ చర్యలతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మోదీ చర్యలతో ఉత్తరాదీలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయి, అందుకే ఇక్కడ జనాభా తగ్గిందని వెల్లడించారు. జనాభా ప్రతిపాదికన 50% పెంచుతామని కేంద్రం అంటుందని.. దీనివల్ల చిన్న రాష్ట్రాలు మనుగడను కోల్పోతాయాన్నారు. ఇది అమలు అయితే యూపీలో 120 సీట్లు, కేరళలో 30 సీట్లు అవుతాయని.. వాటి మధ్య భారీగా 90 సీట్లు అంతరం ఏర్పడుతుందని వివరించారు. ప్రస్తుతం యూపీకి, తెలంగాణకు గ్యాప్ 63 సీట్లు ఉంటే.. పెరిగిన తర్వాత గ్యాప్ 94 సీట్లు అవుతాయని చెప్పారు. అటు ప్రస్తుతం 543 సీట్లలో 413 సీట్లు ఉత్తరాది రాష్ట్రాలవేన్న సీఎం.. సీట్ల పెంపు తర్వాత ఉత్తరాదీ సీట్లు ఏకంగా 620కి చేరుతుందని, అదే దక్షిణాది రాష్ట్రాల్లో 195 సీట్ల వరకు మాత్రమే పెంచబడతాయని వెల్లడించారు.

అధికార దాహం కోసమే మోదీ వ్యూహం

50 శాతం సీట్ల పెంపు ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెంచుతుందని.. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను ద్వితీయ శ్రేణి  పౌరులుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికార దాహం కోసమే మోదీ సర్కార్ సీట్లు పెంచుతుందని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టడం మంచిది కాదని సూచించారు. శిఖండిని అడ్డం పెట్టుకుని అప్పట్లో యుద్దం జరిగినట్లుగా ఇప్పడు మహిళా రిజర్వేషన్‌ను వాడుకుంటూ డీలిమిటేషన్ చేసి దక్షిణాదికి అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలతో పెత్తనం చేయాలని మోదీ భావిస్తున్నారని చెప్పారు.

సీఎం రేవంత్ కొత్త మోడల్ ప్రతిపాదన

డీలిమిటేషన్ (Delimitation) వల్ల ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం తగ్గాలంటే తాను కొత్త మోడల్ ను ప్రతిపాదించదల్చుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక జీడీపీ సహకారాన్ని అందిస్తున్నాయని,  ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా దక్షిణాది ఉందని గుర్తు చేశారు. అదే ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఈ సీట్ల పెంపు విధానం దక్షిణాదికి  తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు. జీఎస్‌డీపీ ప్రాతిపదికన సీట్లను విభజించాలని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్, 50 శాతం మెరిట్ అంటూ రిజర్వేషన్ ఫార్ములాను సుప్రీంకోర్టు కూడా చెప్పేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రస్తుతానికి మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించి అమలులోకి తీసుకురావాలన్న సీఎం.. డీలిమిటేషన్‌పై అన్ని రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను తీసుకోవాలని , ఆ తర్వాతే పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించి ఆమోదం పొందేలా చూడాలన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని 2027 పార్లమెంటు సమావేశాల్లో చర్చించి ఆ తర్వాత డీలిమిటేషన్ పై నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పారు.

Read Also: వికటించిన ముక్కు ఆపరేషన్.. ఆస్పత్రి ఎదుట ఆందోళన!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>