వికటించిన ముక్కు ఆపరేషన్.. ఆస్పత్రి ఎదుట ఆందోళన!

కలం, వరంగల్ బ్యూరో: మహిళకు ముక్కు ఆపరేషన్ (Nose Surgery) వికటించి తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితురాలి కుటుంబ‌స‌భ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పద్మ (50) అనే మహిళ ముక్కుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. దీంతో ఆమె హనుమకొండ (Hanumakonda)లోని ఈఎన్‌టీ (ENT) వైద్యులు గౌడ రమేష్‌ను సంప్రదించారు. రోగిని పరిశీలించిన డాక్టర్ ఆపరేషన్ చేయాలని సూచించాడు. ఈ మేరకు గౌడ రమేష్ దంపతులు పద్మ ముక్కుకు సర్జరీ చేశారు. అయితే వైద్యం వికటించడంతో బాధిత మహిళకు తీవ్ర రక్తస్రావమైంది.

దీంతో ఆమె భర్త, బంధువులు హనుమకొండలోని గౌడ ఈఎన్‌టీ (ENT) ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులను క్లెయిమ్ చేసుకొని అనంతరం మరికొంత మొత్తాన్ని కట్టించుకొని తమ భార్య ప్రాణాలను తీసే విధంగా వ్యవహరించిన గౌడ ENT ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం మేరకు సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వారు తమకు జరిగిన అన్యాయానికి వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: వివాదాలైనా… విధానాలైనా ఈ మంత్రులకు సాటి లేరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>