కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవనం (Musi Rejuvenation) పథకంలో భాగస్వాములను చేయాలని మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితులు డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం ను మధు పార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) ఏ బ్లాక్ నిర్వాసితులు కలిసి నిర్వాసితులుగా తమకు న్యాయం చేయాలని మూడు ప్రతిపాదనలు అందజేశారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవనం అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నామని, అభివృద్ధి పనులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
నిర్వాసితుల ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ మూడు ప్రతిపాదనలను మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ నిర్వాసితులు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి మూసి క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈ.వీ నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి లను డిప్యూటీ సీఎం ఆదేశించారు. డిప్యూటీ ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం సమర్పించిన వారిలో మధు పార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) ఏ బ్లాక్ ప్రెసిడెంట్ డాక్టర్. కె శ్రీశైలం, సెక్రెటరీ డాక్టర్ కరీముల్లా, సలహాదారు సంజయ్ శుక్ల, లీగల్ అడ్వైజర్ ప్రతాపరెడ్డి, జేఏసీ బీఎన్.రెడ్డి, ఉపాధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Also: పెళ్లికి సిద్ధమవుతున్నారా.. వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకండి!
Follow Us On : WhatsApp

